సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు.. చంపేస్తామంటూ?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదరింపులు వచ్చాయి;

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదరింపులు వచ్చాయి. ఆయనను చంపేస్తామంటూ వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హెచ్చరికలు చేసినట్లు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వర్లీ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ కు మెసేజ్ వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని హెచ్చరికలతో కూడి మెసేజ్ వచ్చింది.
ముంబయి పోలీసులు అప్రమత్తమై...
ఈ మెసేజ్ తో ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరు ఈ మెసేజ్ పంపారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బిష్ణోయ్ గ్యాంగ్ ఈ బెదిరింపులకు పాల్పడిందా? లేక మరెవరైనా ఈ మెసేజ్ పెట్టారా? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు