కౌశల్ ని ఇదైనా ఆదుకుంటుందా?
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ విన్నర్ గా బయటికి రాగానే చాల డ్రామా నడిచింది. బిగ్ బాస్ విజేతగా కౌశల్ ఓ వెలుగు వెలుగుతాడనుకుంటే… [more]
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ విన్నర్ గా బయటికి రాగానే చాల డ్రామా నడిచింది. బిగ్ బాస్ విజేతగా కౌశల్ ఓ వెలుగు వెలుగుతాడనుకుంటే… [more]
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ విన్నర్ గా బయటికి రాగానే చాల డ్రామా నడిచింది. బిగ్ బాస్ విజేతగా కౌశల్ ఓ వెలుగు వెలుగుతాడనుకుంటే… అసలు కౌశల్ జాడ అటు సినిమాల్లో కానీ, ఇటు మారె విషయంలో కనిపించలేదు. ఏదో కౌశల్ ఆర్మీ అంటూ హడావిడి తప్ప. అయితే బిగ్ బాస్ విన్నర్ గా అయిన తర్వాత కౌశల్ సినిమా ల్లో హీరోగానే, లేదంటే విలన్ గానో ఓ వెలుగు వెలుగుతాడని అందరూ ఫిక్స్ అవడం కాదు. .. కౌశల్ కన్న కలలు కూడా అవే. కానీ కౌశల్ కి ఓ అన్నంత అవకాశాలు రాలేదు. ఇక బిగ్ బాస్ కి వెళుతూ వదిలేసిన సీరియల్ నే పట్టుకుని వేలాడాల్సిన పరిస్థితి.
అయితే తాజాగా కౌశల్ కి ఓ మంచి పాత్ర పడింది అని.. అది కూడా ఆది సాయికుమార్ హీరో గ తెరకెక్కనున్న సినెమాలో కౌశల్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నాడని ఫిలిం నగర్ టాక్. కౌశల్ కి ఈ పాత్ర ఫైనల్ అయ్యింది అని.. కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. మరి రెండేళ్లుగా ఖాళీగా ఉన్న కౌశల్ ని ఈ ఆది సాయి కుమార్ సినిమాలో పోలీస్ పాత్ర అయినా ఆదుకుంటుందో లేదో చూద్దాం.