ప్రధాని మోదీని కలిసిన అక్కినేని నాగార్జున
ప్రధాని నరేంద్ర మోదీని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు;

ప్రధాని నరేంద్ర మోదీని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకం ఏఎన్‌ఆర్ యొక్క సినీ ప్రస్థానం, సమాజానికి అందించిన సేవలు, మరియు ఆయన ప్రభావాన్ని వివరిస్తుందని మోదీ తెలిపారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అక్కినేని నాగార్జున ప్రధాని మోదీకి “మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం” అనే పుస్తకాన్ని అందజేశారు.
సీనీరంగంలో ఏఎన్నార్ ....
ఏఎన్‌ఆర్ సినీ రంగంలో ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, తెలుగు చిత్రసీమను తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రతిబింబించడంలో ఏఎన్‌ఆర్ విశేషంగా రాణించారని పేర్కొన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి తెలుగు చిత్రపరిశ్రమను మార్చడంలో ఆయన తీసుకున్న దృఢమైన నిర్ణయం, నేడు హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా నిలిపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు.