అరవింద సమేతని తొక్కేసిన గీత..!

గతేడాది గీత గోవిందం సినిమా ఎన్ని రికార్డులను, ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ సినిమా థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద [more]

Update: 2019-01-24 11:31 GMT

గతేడాది గీత గోవిందం సినిమా ఎన్ని రికార్డులను, ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ సినిమా థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కూడా నాన్ బాహుబలి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక గీత గోవిందం హావాలో ఇప్పుడు మరో పెద్ద సినిమా కెవ్వుమంది. అది గతేడాది ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అరవింద సమేత దసరా కానుకగా విడుదలై యావరేజ్ హిట్ గా నిలిచింది. తాజాగా అరవింద సమేత శాటిలైట్ హక్కులు కొన్న జీ ఛానల్ వారు సంక్రాతి కానుకగా తమ ఛానల్ లో అరవింద సమేత ని ప్రసారం చేసింది.

భారీ టీఆర్పీ సొంతం చేసుకున్న గీత గోవిందం

అరవిందకి బుల్లితెర మీద భారీ టిఆర్పీ రేటింగ్స్ వస్తాయనుకున్నవారికి భారీ షాక్ తగిలింది. చాలా పూర్ రేటింగ్స్ ని అరవింద సమేత సొంతం చేసుకుంది. కేవలం 13.7 రేటింగ్ తోనే అరవింద సమేత సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే గీత గోవిందం అయితే మొదటిసారి జీ ఛానల్ లో ప్రసారం అయినప్పుడు 20 రేటింగ్ ని, సెకండ్ టైం ప్రసారం అయినప్పుడు 17 రేటింగ్ ని సొంతం చేసుకుంది. మరి ఎన్టీఆర్ కూడా విజయ్ ముందు ఈ టీఆర్పీ రేటింగ్స్ లో కొట్టుకుపోయాడు. థియేటర్స్ లోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన అరవింద సమేత బుల్లితెర మీద కూడా వెలవెలబోయింది. ఇక ఈ సంక్రాతి కానుకగా బుల్లితెర మీద అరవింద సామెతతో పాటుగా ప్రసారం అయిన సినిమాల టీఆర్పీ రేటింగ్స్…
అరవింద సమేత 13.7
హలో గురు ప్రేమకోసమే 8.7
తొలిప్రేమ 6.2
పందెంకోడి 2.5
అమర్ అక్బర్ ఆంటొని 3.2

Tags:    

Similar News