అబ్బా అదీ ఆగిపోతుందా?

ప్రస్తుతం కరోనా తో ఖాళీగా గడుపుతున్న ప్రేక్షకులకు బుల్లితెరే దిక్కయ్యింది. ఇక ఎప్పుడూ పిల్లల్తో, భర్తలకి పనిచేసి అలిసిపోయి సాధారణ గృహిణులకు డైలీ సీరియల్స్ కాస్త ఊరటనిచ్చేవి. [more]

Update: 2020-04-04 07:43 GMT

ప్రస్తుతం కరోనా తో ఖాళీగా గడుపుతున్న ప్రేక్షకులకు బుల్లితెరే దిక్కయ్యింది. ఇక ఎప్పుడూ పిల్లల్తో, భర్తలకి పనిచేసి అలిసిపోయి సాధారణ గృహిణులకు డైలీ సీరియల్స్ కాస్త ఊరటనిచ్చేవి. దూరదర్శన్ ఉన్నప్పటినుండి డైలీ సీరియల్స్ కి గృహిణులు బానిసలే. అందుకే ఈటివి, మా టివి, జెమిని టీవీ, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో ఎన్ని సీరియల్స్ వచ్చినా అని సీరియల్స్ ని బుల్లితెర ప్రేక్షకులు వదలరు. ఈటీవీలో అయితే చాలా సీరియల్స్ (మనసు మమతా, అభిషేకం, ఆడదే ఆధారం) ఏళ్ళ తరబడి ప్లే అయినా ఆ సీరియల్స్ కి కొంచెమైనా క్రేజ్ తగ్గలేదు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సీరియల్స్ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయాయి. ఇప్పటికే పది రోజులు షూటింగ్స్ ఆగిపోవడంతో.. ఇప్పటివరకు స్టోర్ చేసి పెట్టిన ఎపిసోడ్స్ ని ప్లే చేసిన ఛానల్స్ అన్ని.. కరోనా కారణం కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం త్వరలోనే మల్లి సీరియల్స్ పునః ప్రసారం అంటూ ఛానల్స్ చెబుతున్నాయి.

ఇక కామెడీ ప్రియులకి ఇష్టమైన జబర్దస్త్ ప్రోగ్రాం కి కూడా కరోనా సెగ తగిలింది. నిన్నటివరకు జబర్దస్త్ ఫ్రెష్ ఎపిసోడ్స్ ని ప్లే చేసిన ఈటివి నెక్స్ట్ వీక్ వరకు జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ని ప్లే చేసేలానే ఉంది. ఇప్పటివరకు ముందే షూట్ చేసి పెట్టిన జబర్దస్త్ ఎపిసోడ్స్ ని ప్రసారం చేసారు. ఇన్నేళ్ళలో జబర్దస్త్ ప్రోగ్రాం కి ఇంతవరకు అంతరాయం కలగలేదు. కానీ కరోనా కారణంగా జబర్దస్త్ ప్రోగ్రాం కూడా ఆగిపోయేలా ఉంది. ఇప్పటివరకు ఎలాగోలా ముందే ప్రోగ్రాం చేసి పెట్టుకున్న ఎపిసోడ్స్ తో లాక్కొచ్చిన ఛానల్ ఇక నెక్స్ట్ వీక్ నుండి లేటెస్ట్ ఎపిసోడ్స్ ని ప్లే చేయలేకపోవచ్చేమో అంటున్నారు. అయితే మళ్ళీ ఏప్రిల్ 14 నుండి లాక్ డౌన్ ఎత్తివేస్తే లేటెస్ట్ ఎపిసోడ్స్ షూట్ చేసి జబర్దస్త్ కి ఎక్కడ అంతరాయం కలగకుండా మల్లెమాల చూడగలదు. కానీ లాక్ డౌన్ పొడిగిస్తేనే జబర్దస్త్ ప్రేక్షకులు ఫీలవ్వాల్సి వస్తుంది. ఇక సీరియల్స్ ప్లే చెయ్యాల్సిన టైం లో ఈటివి వారు దసరా, సంక్రాతి, ఉగాది పండగలకు చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ ని ప్లే చేస్తూ ప్రేక్షకులని నవ్విస్తున్నారు.

Tags:    

Similar News