ఇక్కడే కాదు.. అక్కడా సెన్సేషనే!!
తెలుగులో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా యూత్ సెన్సేషనల్ క్రేజ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోగా [more]
తెలుగులో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా యూత్ సెన్సేషనల్ క్రేజ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోగా [more]
తెలుగులో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా యూత్ సెన్సేషనల్ క్రేజ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ పిచ్చెక్కిపోయారు. ఒకే ఒక్క సినిమాతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కొత్త హీరోయిన్ షాలిని పాండే కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇదే అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా కబీర్ సింగ్ అనే పేరుతొ షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా రీమేక్ చేసాడు. ఆ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి బాలీవుడ్ లోను కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ తో అదరగొట్టింది.
షాహిద్ కపూర్ కి అటు నటన పరంగా, ఇటు వసూళ్ల పరంగా కబీర్ సింగ్ కెరీర్ బెస్ట్ మూవీ కావడం ఖాయం అంటున్నారు.ఈ మూవీకి కేవలం ప్రేక్షకుల నుండి మాత్రమే కాదు… సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ తో దుమ్ముదులిపింది. దాదాపు 20కోట్ల షేర్ తో ఈ సంవత్సరానికి బాలీవుడ్ లో రెండవ అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. ఇప్పటివరకు మంచి హిట్స్ తో ఉన్న షాయిద్ కపూర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఖాన్స్ త్రయం సరసన చేరడం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు. కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక హీరోయిన్ కియారా కూడా లిప్ కిస్ సీన్స్ లో అదరగొట్టేసింది. షాహిద్ నటనకు దర్శకుడు సందీప్ వంగా ప్రతిభ తోడవడంతో మంచి ఓపెనింగ్స్ మాత్రమే కాదు…. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో అదరగొట్టడం ఖాయం గానే కనబడుతుంది.