కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ?

ఓటీటీలో సినిమా విడుదల చేస్తే.. సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని పలువురు కోరుతున్నారు.;

Update: 2022-09-09 13:54 GMT
కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ?
  • whatsapp icon

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా కార్తికేయ -2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ కి జోడీగా అనుపమ నటించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన కార్తికేయ 2.. నార్త్ ఆడియన్స్ నూ అలరించింది. ఇటీవలే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే కార్తికేయ థియేటర్లలో రన్ అవుతూ కనెక్షన్లు వసూలు చేస్తూనే ఉంది. కాగా.. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలో సినిమా విడుదల చేస్తే.. సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 భారీ రేటుకు కొనుగోలు చేసింది. కార్తికేయ-2 చిత్రాన్ని అన్ని భాషల్లో సెప్టెంబర్ 30 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట రెడీ అవుతోందట. కానీ.. జీ5 అందుకు ఒప్పుకుంటుందా ? అన్న విషయంపై క్లారిటీ లేదు. త్వరలోనే కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.






Tags:    

Similar News