ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
ఇటీవలే మలయాళ స్టార్ కమెడియన్ మముక్కోయ మాట్లాడుతూ కుప్పకూలిపోయి.. రెండ్రోజుల అనంతరం మరణించారు.
ఇండస్ట్రీలో ఇటీవల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సౌత్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్లు హఠాన్మరణం చెందుతున్నారు. ఇటీవలే మలయాళ స్టార్ కమెడియన్ మముక్కోయ మాట్లాడుతూ కుప్పకూలిపోయి.. రెండ్రోజుల అనంతరం మరణించారు. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. కోలీవుడ్ లో పెద్ద నిర్మాతగా పేరుగాంచిన ఎస్ఎస్ చక్రవర్తి శనివారం(ఏప్రిల్ 29) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోన్న చక్రవర్తి(55) చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. చక్రవర్తి మరణంతో తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. చక్రవర్తి 1997 లో ‘రాశి’ అనే చిత్రంతో నిర్మాతగా కోలీవుడ్ పరిశ్రకు పరిచయం అయ్యారు. ఆంజనేయ, సిటిజెన్, మగవారే, వాలి, రెడ్ చిత్రాలను అజిత్ హీరోగా నిర్మించారు. శింబుతో కాలై, వాలు వంటి సూపర్ హిట్ సినిమాలనూ నిర్మించారు. చక్రవర్తికి ఒక కొడుకు, కూతురు ఉండగా.. కొడుకు హీరోగా తెరంగేట్రం కూడా చేశాడు.