Chiranjeevi : చిరు కుడి చేతికి ఏమయింది?

మెగాస్టార్ చిరంజీవికి అపోలో ఆసుపత్రి లో శస్త్ర చికిత్స చేశారు. గత కొద్దికాలంగా చిరంజీవి కుడి చేయి నొప్పిగా ఉంది. మణికట్టు వద్ద నొప్పి తీవ్రమవ్వడంతో ఆయన [more]

;

Update: 2021-10-17 14:44 GMT
Chiranjeevi : చిరు కుడి చేతికి ఏమయింది?
  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవికి అపోలో ఆసుపత్రి లో శస్త్ర చికిత్స చేశారు. గత కొద్దికాలంగా చిరంజీవి కుడి చేయి నొప్పిగా ఉంది. మణికట్టు వద్ద నొప్పి తీవ్రమవ్వడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. దీంతో అపోలో ఆసుపత్రి వైద్యులు చిరంజీవి కుడి చేతికి శస్త్ర చికిత్స చేశారు. పెద్ద ఆపరేషన్ కాదని, నరం నొప్పిగా ఉంటే వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

షూటింగ్ లో గాయమనుకుని…

చిరంజీవి కుడిచేతికి కట్టుతో కనపడటంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలయింది. షూటింగ్ సమయంలో గాయమయి ఉంటుందని భావించారు. కానీ చిరంజీవి దీనిపై క్లారిటీ ఇచ్చారు. మణికట్టు వద్ద ఉన్న నరంపై వత్తిడి పెరగడంతో నొప్పి తీవ్రమయిందని, అందుకే వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చిరంజీవి తెలిపారు.

Tags:    

Similar News