సరికొత్తగా విశ్వక్ "ముఖచిత్రం".. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్ ట్రైలర్
ఒక అమ్మాయిని ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లాడాల్సి వస్తుంది. ఇద్దరికీ ఒకేసారి యాక్సిడెంట్ అవడంతో.. ఒకరు చనిపోగా ..
కలర్ ఫొటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథతో.. కొత్త దర్శకుడు గంగాధర్ దర్శకత్వంలో.. వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా "ముఖచిత్రం". ఇంతవరకూ ఎలాంటి హడావిడి లేకుండా ఒకేసారి ట్రైలర్ తో వచ్చేసింది "ముఖచిత్రం" టీమ్. ఇందులో విశ్వక్ సేన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక అమ్మాయిని ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లాడాల్సి వస్తుంది. ఇద్దరికీ ఒకేసారి యాక్సిడెంట్ అవడంతో.. ఒకరు చనిపోగా మరొకరు చావు బతుకుల మధ్య ఉంటే ఒకరి ముఖాన్ని తీసి ఇంకొకరికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు హీరో. ఆ తర్వాత ఎదురైనా పరిస్థితులు ఏంటి? హీరోకి, వేరే వాళ్ళకి ఆ అమ్మాయి వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయి. ఇది కోర్టు దాకా వెళ్లడంతో కోర్టులో ఏం జరిగింది? అనే అంశంతో థ్రిల్లర్ లా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ను కట్ చేశారు.
విశ్వక్ సేన్ లాయర్ గా కనిపించాడు. ట్రైలర్ సస్పెన్స్ గా ఉండటం, విశ్వక్ ముఖ్యపాత్రలో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలున్నాయి. డిసెంబర్ 9న ముఖచిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మరి "ముఖచిత్రం" ప్లాస్టిక్ సర్జరీ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.