అమితాబ్ బచ్చన్ ప్లేస్ లో బాలకృష్ణ?

హిందీ లో పింక్ అనే సినిమా రీసెంట్ గా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అమితాబ్ అండ్ తాప్సి నటించిన ఈసినిమాను తమిళంలో అజిత్ చేస్తున్నాడు. [more]

Update: 2019-08-03 06:58 GMT

హిందీ లో పింక్ అనే సినిమా రీసెంట్ గా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అమితాబ్ అండ్ తాప్సి నటించిన ఈసినిమాను తమిళంలో అజిత్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈసినిమా పై ద్రుష్టి పడింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి. కొన్ని రోజులు కిందట ఈసినిమాను చూసిన దిల్ రాజు దీన్ని తెలుగు లోకి రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు. అందుకు సంబందించిన రైట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే తెలుగులో ఎవరు చేస్తారు అనే ప్రశ్నకు దిల్ రాజు దగ్గర జవాబు కూడా ఉంది. అన్ని కుదిరితే ఈసినిమాలో బాలకృష్ణ చేసే అవకాశముంది. దిల్ రాజు సంకల్పం కూడా అదే. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోస్ తో పని చేసిన అనుభవం ఉన్న దిల్ రాజు కి ఒక్క బాలయ్య తో మాత్రం చేయలేదు. ఈసినిమా ఒకవేళ బాలయ్య ఒప్పుకుంటే ఆ లోటు కూడా తీరిపోతుంది దిల్ రాజు కు. పైగా ఇది బాలయ్యకి సరైన సబ్జెక్ట్.

దిల్ రాజు దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ‘లాయర్ సాబ్’ అన్నది టైటిల్. బాలయ్య ఓకే అనడమే లేట్. వెంటనే అనౌన్స్ మెంట్ వస్తుంది అలానే స్టోరీ కూడా చకచకా రెడీ అయిపోతుంది. కాకపోతే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Tags:    

Similar News