NBK 107 : నేడు కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్ అనౌన్స్ మెంట్

తాజాగా.. ఎన్బీకే 107 టైటిల్ ను దీపావళి కానుకగా ఈ రోజు సాయంత్రం ప్రకటించనుంది చిత్రబృందం. మైత్రీ మూవీస్ బ్యానర్ పై..;

Update: 2022-10-21 06:52 GMT
NBK 107 Title, balakrishna

NBK 107 Title

  • whatsapp icon

ఆరుపదుల వయసు దాటినా.. నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలతో.. మరో వైపు టాక్ షో తో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన బాలయ్య.. వరుస షూటింగులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది.

తాజాగా.. ఎన్బీకే 107 టైటిల్ ను దీపావళి కానుకగా ఈ రోజు సాయంత్రం ప్రకటించనుంది చిత్రబృందం. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నుంచి నాలుగు నెలల క్రితం టీజర్ వచ్చింది. అందులో.. బాలయ్య అదిరిపోయే పవర్ఫుల్ డైలాగ్ తో కనిపించాడు. 'నరకడం మొదలుపెడితే.. ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా..' అంటూ టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీ టైటిల్ లోగోను కర్నూలులోని ఐకానిక్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు రాత్రి 8.15 నిమిషాలకు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.

Full View

Tags:    

Similar News