సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్ప జరుగుతోందని వైద్యులు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ అయ్యిందని.. వైద్యులు సీపీఆర్ చేశారని చెప్పుకొచ్చారు. 24 గంటల తర్వాత ఆరోగ్యంపై ప్రకటన చేస్తామని అన్నారు. అర్థరాత్రి సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన క్రిటికల్ స్టేజ్ లో వున్నారని వైద్యులు తెలిపారు. కాంటినెంటల్ ఎండీ గురు.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. గంట గంటకు ఏమవుతుందో చెప్పలేమన్నారు. శరీరం సహకరించే దాన్ని బట్టి వైద్యం అందిస్తూ ఉన్నామని అనన్ఱు. ఆసుపత్రికి వచ్చినపుడు ఆయన స్పృహలో లేరన్నారు గురు.ఎన్.రెడ్డి. కాంటినెంటల్ హాస్పటల్ కు మహేష్ బాబు సహా ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారు. కృష్ణ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.