శ్రీకారం సినిమాకి ప్రోపర్ బజ్ రాలేదు

ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా నటుడిగా మంచి బ్రేక్ తెచ్చుకున్న శర్వానంద్.. మంచి మంచి ప్రాజెక్ట్స్ చూజ్ చేసుకుంటూ వచ్చాడు. శతమానం భవతి సినిమాతో అయితే సూపర్ డూపర్ [more]

;

Update: 2021-02-15 05:36 GMT

ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా నటుడిగా మంచి బ్రేక్ తెచ్చుకున్న శర్వానంద్.. మంచి మంచి ప్రాజెక్ట్స్ చూజ్ చేసుకుంటూ వచ్చాడు. శతమానం భవతి సినిమాతో అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టి.. తన ఏజ్ హీరోస్ లో తన ప్లేస్ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. కానీ అక్కడినుండి మాత్రం శర్వానంద్ అంచనాలు తప్పుతున్నాయి. అతని అదృష్టము కలిసి రావడం లేదు. చేస్తున్నవి మంచి ప్రయత్నాలే అయినా.. ప్రతిసారి శర్వానంద్ ని పరాజయాలు పలకరిస్తూ వస్తున్నాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు వరసగా ప్లాప్ అయ్యాయి. తమిళ సూపర్ హిట్ ఫిలిం 96 ని జానూ గా రీమేక్ చేసాడు.
సమంత లాంటి స్టార్ హీరోయిన్ కాంబినేషన్ లో చేసిన ఆ సినిమా కి వర్కౌట్ అవ్వలేదు. ప్రయత్నాలు మంచివే  కానీ ఫలితాలు రావడం లేదు. ఇప్పుడు కూడా శర్వానంద్ లేటెస్ట్ ఫిలిం శ్రీకారం మంచి కాన్సెప్ట్. ఒక పక్కన రైతుల ఉద్యమం జరుగుతున్నా సమయంలో.. శ్రీకారం కథ తో మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. సరైన కంటెంట్ తోనే వస్తున్నాడు. అయితే ఇప్పటివరకు శ్రీకారం సినిమాకి ప్రోపర్ బజ్ రాలేదు. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఈ సినిమాతో అయినా శర్వా సరైన రిజల్ట్ అందుకుంటాడా? తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా? జస్ట్ వెయిట్ అండ్ సి.

Tags:    

Similar News