ఈ రెండు సినిమాల్లో ఒకటి డిజాస్టర్.. మరొకటి!
సంక్రాంతి సినిమాల జోరు హోరు తగ్గడమే కాదు.. సంక్రాతి సినిమాలన్నీ అప్పుడే ఓటిటిలో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఈ సంక్రాంతి హిట్ క్రాక్ కూడా ఆహా ఓటిటి ద్వారా [more]
సంక్రాంతి సినిమాల జోరు హోరు తగ్గడమే కాదు.. సంక్రాతి సినిమాలన్నీ అప్పుడే ఓటిటిలో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఈ సంక్రాంతి హిట్ క్రాక్ కూడా ఆహా ఓటిటి ద్వారా [more]
సంక్రాంతి సినిమాల జోరు హోరు తగ్గడమే కాదు.. సంక్రాతి సినిమాలన్నీ అప్పుడే ఓటిటిలో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఈ సంక్రాంతి హిట్ క్రాక్ కూడా ఆహా ఓటిటి ద్వారా ఆన్ లో విడుదలైపోయింది. ఇక ఆ తర్వాత మూడు వారాల్లో విడుదలైన మూడు సినిమాలకు ప్లాప్ టాకే పడింది. ప్రేక్షకులు ఓవరాల్ గా మూడు సినిమాలను ప్లాప్ గా తేల్చేసారు. అందులో అల్లరి నరేష్ బంగారు బుల్లోడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఒకే ఒక్క సాంగ్ తో సేవ్ అయిన సినిమాగా మిగిలిపోయింది. నీలి నీలి ఆకాశం సాంగ్ హిట్ అవడంతో.. 30 రోజుల్లో ప్రేమించడం సినిమాకి ప్లాప్ టాక్ పడినా.. ఆ సినిమా రెవిన్యూ పరంగా లాభాల్లోకి వచ్చేసింది.
అల్లరి నరేష్ బంగారు బుల్లోడు థియేట్రికల్ బిజినెస్ 3.5 కోట్లకి జరగగా.. ఫైనల్ రన్ లో బంగారు బుల్లోడు 1.90 కోట్ల కలెక్షన్స్ తో ప్లాప్ గా మిగిలిపోయింది.
ఏరియా కలెక్షన్స్
నైజాం 0.57
సీడెడ్ 0.32
ఉత్తరాంధ్ర 0.27
ఈస్ట్ 0.17
వెస్ట్ 0.12
కృష్ణా 0.14
గుంటూరు 0.16
నెల్లూరు 0.09
ఏపీ అండ్ టీఎస్ 1.84 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.07
ఓవర్సీస్ 0.04
టోటల్ వరల్డ్ వైడ్ 1.94 కోట్లు (షేర్)
ప్రదీప్ మంచి రాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న సాంగ్ సేవ్ చేసింది. లేదంటే ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయేది. 4.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఫైనల్ రన్ లో 6.86 కోట్లు కొల్లగొట్టింది. దానితో సక్సెస్ లిస్ట్ లో చేరింది.
ఏరియా కలెక్షన్స్
నైజాం 2.07
సీడెడ్ 1.28
ఉత్తరాంధ్ర 0.83
ఈస్ట్ 0.50
వెస్ట్ 0.40
కృష్ణా 0.48
గుంటూరు 0.55
నెల్లూరు 0.30
ఏపీ అండ్ టీఎస్ 6.41 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.21
ఓవర్సీస్ 0.24
టోటల్ వరల్డ్ వైడ్ 6.86 కోట్లు