బ్రో సినిమాలో ఏపీ మంత్రిని టార్గెట్.. డైరెక్టర్ చెబుతోంది ఇదే..!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'బ్రో'. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంది

Update: 2023-07-29 02:14 GMT

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'బ్రో'. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో ఓ పాటలో ఏపీ మంత్రి పోలికలతో ఉండే పాత్రను 30 ఇయర్స్ పృధ్వీతో చేయించారు. ఆయన ఒకప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీని వీడి జనసేనకు విధేయుడిని అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రో సినిమాలో కూడా 30 ఇయర్స్ పృధ్వీని వాడుకున్నారు. సినిమాలోని కథతో అతడికి ఏ మాత్రం సంబంధం ఉండదు. పాటలో కనిపించి వెళ్ళిపోతారు అంతే..!

30 ఇయర్స్ పృధ్వీని కేవలం ఒక ఏపీ మంత్రిని ట్రోల్ చేయడానికే పెట్టుకున్నారని అర్థం అవుతూ ఉంది. బ్రో సినిమా కథకు 30 ఇయర్స్ పృధ్వీకి సంబంధం లేదు. పబ్ లో 2 సార్లు కనిపిస్తాడు. అదే పనిగా ఓ డాన్స్ మూమెంట్ వేయించారు. ఆ డాన్స్ పై పవన్ పంచ్ వేస్తాడు. ఇదంతా వైసీపీ నేత మీద సెటైర్. గతంలో ఆ మంత్రి పండగ సందర్భంగా డాన్స్ చేయగా.. అది బాగా వైరల్ అయింది. అప్పుడు అంబటి వేసుకున్న డ్రెస్ నే, సినిమాలో పృధ్వీకి ఇచ్చారు. దాదాపు అలాంటి స్టెప్పుల్నే వేయించారు. దానికి పవన్ తో డైలాగ్ చెప్పించారు.
బ్రో సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చిత్ర దర్శకుడు సముద్రఖని ఈ విషయంపై స్పందించారు. ఆ విషయం తనకు తెలియదన్నారు. సినిమాలో డాన్సు సరిగా చేయలేని సీన్‌ ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలో అలా పవన్‌ చేత చెప్పించి కాస్త వినోదాన్ని పండించే ప్రయత్నం చేశామని అన్నారు. ఆ సీన్‌ని బట్టి తీశామని, కానీ మంత్రి గొడవ తనకు తెలియదని చెప్పారు.


Tags:    

Similar News