రష్మికా… ఏమైంది

సరిలేరు నీకెవ్వరూ తో ఈ ఏడాది హిట్ కొట్టిన రష్మిక నితిన్ తో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు సినిమాల ప్రమోషన్స్ తో [more]

Update: 2020-03-15 08:03 GMT

సరిలేరు నీకెవ్వరూ తో ఈ ఏడాది హిట్ కొట్టిన రష్మిక నితిన్ తో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు సినిమాల ప్రమోషన్స్ తో బాగా బిజీ అయినా రష్మికా భీష్మ సక్సెస్ తో కాస్త రిలీఫ్ అయ్యిది. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా కోసం రేడి అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో ఏ ఫోటోనో ఏ ట్వీట్ వేస్తూ వుండే రష్మిక.. ఆభిమానులకు చాల దగ్గరగా ఉండేది. చాలా తక్కువ సమయంలో స్టార్ డం సొంతం చేసుకున్న రష్మిక అభిమానులకు కొదవలేదు. అయితే అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ పలకరించే రష్మిక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరమైంది. ఎందుకో ఏమిటో రష్మికా మాత్రం సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చెయ్యడం కానీ.. ఓ ట్వీట్ చెయ్యడం కానీ లేదు. దానితో ఫ్యాన్స్ బెంగ పెట్టేసుకున్నారు.

రష్మిక ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్లిపోయావ్ నీవు? నీవైమైన సోషల్ మీడియా పాస్ వర్డ్ మర్చిపోయావా? మీరు ఇచ్చే అప్ డేట్ లేక బోర్ కొడుతోంది? రోజులు చాలా డల్ గా గడుస్తున్నాయి? అంటూ అభిమానులు రష్మిక కు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ ట్వీట్స్ కి రష్మిక రిప్లయ్ ఇచ్చింది. కొన్ని రోజులు సోషల్ మీడియా కి దూరమయ్యా.. క్షమించండి.. ఇప్పుడు నేను వచ్చేసా అంటూ రష్మిక తన అభిమాన గణానికి ట్వీటేసింది. మరి రష్మిక కమ్ బ్యాక్ అంటూ ఓ హాష్ ట్యాగ్ తో అల్లరల్లరి చేసిన రష్మిక ఫ్యాన్స్…. ఆమె ఇచ్చిన ట్వీట్ తో కూల్ అవడమే కాదు… ఎందుకు ఇలా మమ్మల్ని బాధపెట్టావ్ రష్మిక అంటూ తెగ ఇదైపోతున్నారు. మరి అభిమానుల ట్వీట్స్ కి రష్మిక ఎక్కడున్నా దిగొచ్చినట్లే ఉంది.

Tags:    

Similar News