లాస్య తో గొడవేం లేదు.. కానీ లాస్య మాత్రం?

రవి – లాస్య మంచి ఫ్రెండ్స్. అలాగే ఇద్దరు చాలా షోస్ లో కలిపి యాంకరింగ్ చేసారు. కానీ ఏమైందో ఏమో లాస్య రవి ఇద్దరూ బద్ద [more]

Update: 2020-04-09 17:31 GMT

రవి – లాస్య మంచి ఫ్రెండ్స్. అలాగే ఇద్దరు చాలా షోస్ లో కలిపి యాంకరింగ్ చేసారు. కానీ ఏమైందో ఏమో లాస్య రవి ఇద్దరూ బద్ద శత్రువుల్లా మారిపోయారు. అయితే లాస్య పెళ్లి చేసుకుని బుల్లితెరకు దూరమవగా.. రవి పెళ్ళాన్ని కూతురిని తరుచు టివి షోస్ లో అందరికి చూపిస్తున్నాడు. అయితే లాస్య మాత్రం రవి తో తనకి గొడవేం లేదంటూనే రవి తనకి పెళ్ళైన విషయం దాచి తనకి ప్రపోజ్ చేసాడని.. పెళ్లి కూడా చేసుకుడ్నమన్నాడని,… కానీ తనకి రవి విషయం తెలిసి సైలెంట్ గా తప్పుకున్నా అంటూ చెప్పింది,

కానీ రవి మాత్రం తనకి నాకు గొడవేం లేదని.. లాస్య నేను ధీ షో ని రెండు సీజన్స్ లో సక్సెస్ ఫుల్ గా చేసాం. అయితే ఇక టీం లీడ్ చెయ్యను యాంకరింగ్ చేస్తా అని ధీ యాజమాన్యాన్ని అడగగా.. లాస్య కూడా యాంకరింగ్ చేస్తా అని అడగడంతో మా ఇద్దరినీ షో నుండి తీసేయారు. తర్వాత నేను వేరే షోస్ తో బిజీ అయితే లాస్య కి మాత్రం ఎలాంటి షోస్ రాలేదు. అయితే నీ వల్లే నాకు అవకాశాలు పోయాయని అంటూ నెగెటివ్ గా వెళ్లిన లాస్య ఇప్పటికి అలానే ఉంది. ఇద్దరం కలిసి షోస్ చేసాం. ఇద్దరికీ పేరొచ్చింది. కానీ ఇపుడు తాను నన్ను సరిగా అర్ధం చేసుకోవడం లేదంటూ రవి లాస్య గురించి తాజాగా ఓ షో లో చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News