నితిన్ కి రీమేక్ కష్టాలు?

భీష్మ తో భారీ హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం రంగ దే సినిమాతో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సెట్స్ మీదున్నాడు. కరోనా కలకలం లేకపోతె ఈ [more]

Update: 2020-04-15 06:07 GMT

భీష్మ తో భారీ హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం రంగ దే సినిమాతో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సెట్స్ మీదున్నాడు. కరోనా కలకలం లేకపోతె ఈ పాటకి రంగ్ దే షూటింగ్ కంప్లీట్ అయ్యేది. ఇక నితిన్ వరసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక ఈ వారంలో నితిన్ పెళ్లి జరగాల్సి ఉండగా.. కరోనా కారణముగా ఆ పెళ్లి కూడా వాయిదా పడింది. ఇక నితిన్ రంగ్ దే తర్వాత బాలీవుడ్ మూవీ అంధధూన్ సినిమాని రీమేక్ చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన బాలీవుడ్ అంధుదాన్ కి అవార్డులు రివార్డులు, ఇంకా బోలెడంత డబ్బు వచ్చాయి. ఆయుష్మాన్ పాత్రలో నితిన్ కనిపిస్తాడు.

అయితే వచ్చిన చిక్కల్లా…. బాలీవుడ్ అంధధూన్ లో ఆయుష్మాన్ ఖురణతో పోటీ పడి పేరు తెచ్చుకున్న టబు పాత్రతోనే ఇప్పుడు తెలుగు దర్శకుడికి చిక్కొచ్చి పడింది. అంధధూన్ లో నెగెటివ్ రోల్ తో ఇరగదీసిన టబు పాత్ర ని తెలుగులో ఎవరితో చేయించాలనే దానిమీద ఇంకా క్లారిటీ రాలేదు. ట‌బు లాంటి న‌టి… నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర పోషించ‌డం వ‌ల్ల అంధధూన్ కి అధ‌న‌పు హంగు ఏర్ప‌డింది. అయితే ఆ పాత్ర కోసం తమిళ నటి జ్యోతిక పేరు వినిపించినా.. జ్యోతిక ఆ పాత్రని ఒప్పుకునే ఛాన్స్ లేదు. అయితే కాస్త పేరున్న మాజీ హీరోయిన్ అయితే బావుంటుంది అని.. నేనే రాజు నేనే మంత్రితో అదరగొట్టిన కేథ‌రిన్‌ కానీ అమ‌లాపాల్ లాంటి వాళ్ల‌ని ఆ పాత్ర కోసం అనుకుంటున్నారట. ఇక ఎవరు ఓకే కాకపోతే చివరికి టబునే ఒప్పిద్దామని డిసైడ్ అయినా.. ఆమె పారితోషకం తట్టుకోవడం కష్టమని నితిన్ బ్యాచ్ ఫీలవుతుందట.

Tags:    

Similar News