సమంతకు గుడి కడుతున్న ఫ్యాన్.. పుట్టినరోజున ఓపెనింగ్

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా ఆలాపడుకు చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. ఆమెకు మయోసైటిస్ వచ్చినపుడు..

Update: 2023-04-26 14:44 GMT

Samantha Temple

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తైంది. అయినా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏ మాయ చేశావె తో మొదలు.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా సమంత పాన్ ఇండియా నటిగా ఎదిగింది. నిజ జీవితంల ఎన్ని సమస్యలొచ్చినా.. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఇక సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్ అంటే ఇప్పటికే కుర్రకారు పడి చచ్చిపోతారు. సమంత మీద ఉన్న అభిమానంతో ఓ వీరాభిమాని ఆమెకు ఏకంగా గుడి కట్టేందుకు రెడీ అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా ఆలాపడుకు చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. ఆమెకు మయోసైటిస్ వచ్చినపుడు.. ఆమె ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలు సందర్శించి మొక్కుబడులు చెల్లించాడు. ఇప్పుడు తన ఇంటిలోనే సమంతకు గుడి కట్టి, అందులో ఆమె విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ గుడిని ఏప్రిల్ 28న సమంత బర్త్ డే కానుకగా ఓపెన్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత విజయదేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. అలాగే త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది.







Tags:    

Similar News