జాను ని చూసి లెస్సెన్ నేర్చుకుంటే బావుండేదేమో?

క్లాసిక్‌లను రీమేక్ చేయడం ప్రమాదకరం మాత్రమే కాదు.. చాలా ఖరీదైన వ్యవహారం అని చాలాసార్లు నిరూపించబడింది. ఎందుకంటే అలాంటి సినిమాలను రీమేక్ చేసినప్పుడు అసలైన సినిమాలతో పోల్చడం [more]

Update: 2020-02-10 06:59 GMT

క్లాసిక్‌లను రీమేక్ చేయడం ప్రమాదకరం మాత్రమే కాదు.. చాలా ఖరీదైన వ్యవహారం అని చాలాసార్లు నిరూపించబడింది. ఎందుకంటే అలాంటి సినిమాలను రీమేక్ చేసినప్పుడు అసలైన సినిమాలతో పోల్చడం అతి పెద్ద సమస్య. దర్శకనిర్మాతలు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసినా… రీమేక్‌లోని నటీనటులు అద్భుతమైన నటన ప్రదర్శన ఇచ్చినా… ప్రేక్షకులు తొందరగా డైజెస్ట్ చేసుకోలేరు. పర భషలో హిట్ అయిన సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రాగానే ప్రేక్షకులు ఆ భాష అర్ధం కాకపోయినా వీక్షించేస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులో తమిళ క్లాసిక్ 96 ను జాను గా రీమేక్ చేయడం ద్వారా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు.

సినిమా హిట్టే. దర్శకుడు ప్రేమ్ కుమార్ మరోసారి అద్భుతమైన పనితనంతో ఆకట్టుకున్నాడు. శర్వానంద్ మరియు సమంత అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగతా సాంకేతిక బృందం కూడా తమవంతు కష్టపడింది. కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవుతోంది. అదే కారణాలు కలెక్షన్స్ పై ప్రభావం చూపుతున్నాయి. జానూ వైఫల్యం దిల్ రాజు కి షాక్. రేపు దిల్ రాజు విడుదల చెయ్యబోయే పింక్ రీమేక్ పరిస్థితి అంతే అంటున్నారు. మరోపక్క సురేష్ బాబు, వెంకటేష్ కలిసి చేస్తున్న అసురన్ పరిస్థితి అంతే అని.. అంటున్నారు. వెంకటేష్ అసురన్, పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లకు ఇలాంటి షాక్ తప్పదని జాన చూసి వీరు పాఠం నెర్చుకుంటే బావుండేదని అంటున్నారు.

Tags:    

Similar News