కవలలకు జన్మనిచ్చిన చిన్మయి.. ఆ ప్రశ్నలు వేస్తున్నారట
కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్నారు
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గత కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చెప్పుకొచ్చారు. చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్నారు. నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాగా పేరు సంపాదించుకున్న చిన్మయి పలు భాషల్లో పాటలు పాడారు. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. వీరికి కవలలు పుట్టడంతో నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.