హీరోయిన్స్ కలల రాకుమారుడుకి ఆ జబ్బా?

టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు.. ఏ భాష హీరోయిన్ అయినా.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చెయ్యాలనో… లేదా విక్కీ కౌశల్ తో [more]

Update: 2020-04-23 12:11 GMT

టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు.. ఏ భాష హీరోయిన్ అయినా.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చెయ్యాలనో… లేదా విక్కీ కౌశల్ తో అవకాశం వస్తే ఓ సినిమా చెయ్యాలనో చెబుతారు. మరి అలాంటి హీరోయిన్స్ కలల రాకుమారుడు విక్కీ కౌశల్ కి ఓ వింత జబ్బు ఉందట. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడాడు. కెరీర్ లో సినిమాల్తో బాగా బిజీగా వున్నా విక్కీ కౌశల్ వ్యక్తిగతంగా చాల ఇబ్బందులే పడ్డాడట.

స్లీప్ పెరాల్సిస్ తో విక్కీ కౌశల్ చాలా బాధపడ్డాడట. స్లీప్ పెరాల్సిస్ అంటే..(కొందరికి నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చిన సమయంలో మనిషి స్పృహ ఉంటుంది కానీ… శరీరం మాత్రం కొన్ని క్షణాల పాటు మనిషి స్వాధీనంలో వుండదు. దాంతో మనిషిలో చలనం వుండదు. అంతా తెలుస్తూనే వుంటుంది కానీ, నిద్రలోంచి లేవలేడు.) ఇక నిజంజీవితంలో మీరు దెయ్యాన్ని చూసారా. అంటే.. దెయ్యం కన్నా భయంకరమైన స్లీప్ పెరాల్సిస్ ని ఎదుర్కున్న అని… అది చాల భయనామకంగా ఉంటుంది అని చెప్పాడు. ఇక దెయ్యాలంటే భయమా… అని దిగితే… దెయ్యాల సినిమాలు అన్నా, దెయ్యాల కథలన్నా..చాలా భయమని.. అందుకే దెయ్యాల కథలు విననని.. దెయ్యాల సినిమాలు చూడనని చెబుతున్నాడు.

Tags:    

Similar News