రకుల్ కి షాకిచ్చిన స్టార్ హీరో..?

రకుల్ ప్రీత్ ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కాజల్, సమంత, తమన్నా లాంటి హీరోయిన్స్ రకుల్ ప్రీత్ హవాకి తలొగ్గారు. అంతలా రకుల్ ప్రీత్ టాలీవుడ్ [more]

Update: 2019-03-27 08:13 GMT

రకుల్ ప్రీత్ ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కాజల్, సమంత, తమన్నా లాంటి హీరోయిన్స్ రకుల్ ప్రీత్ హవాకి తలొగ్గారు. అంతలా రకుల్ ప్రీత్ టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అలాగే తమిళంలోనూ అడుగుపెట్టింది. అక్కడ కూడా అందిన హీరోతో అందినట్టుగా సినిమాలు ఒప్పేసుకుంది. కానీ ఒకే ఒక్క సినిమా రకుల్ ఫేట్ ని మార్చేసింది. అదే మహేష్ బాబుతో చేసిన స్పైడర్. స్పైడర్ సినిమా దెబ్బకి టాలీవుడ్, కోలీవుడ్ లలో రకుల్ అవకాశాలు గాలిలో కలిసిపోయాయి. ఆ సినిమాలో ఎలాంటి ఇంపార్టెన్స్ లేని పాత్రలో రకుల్ నటించడం, ఆ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో రకుల్ అవకాశాల కోసమే ఆరాటపడాల్సిన పరిస్థితి వచ్చేసింది.

వద్దని చెప్పేసిన రకుల్

కోలీవుడ్ లో సూర్యతో ఒక్క సినిమా, తెలుగులో సీనియర్ హీరో నాగ్ తో మన్మధుడు 2 సినిమాలు చేస్తున్న రకుల్.. పారితోషకం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మన్మధుడు 2 కోసం రకుల్ ఏకంగా 2 కోట్ల పారితోషకం అందుకుంటుందని టాక్ ఉండనే ఉంది. అవకాశాలు లేకపోయినా రెమ్యునరేషన్ గట్టిగా పిండుతున్న రకుల్ కి ఇప్పుడొక స్టార్ హీరో షాకిచ్చాడని వార్తలు గుప్పుమన్నాయి. అదే స్పైడర్ తో ఫ్లాప్ కొట్టిన మహేష్. మహేష్ మరోసారి రకుల్ తో సినిమా చేయాలనుకోవడం లేదట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమా కోసం అనిల్, దిల్ రాజు రకుల్ పేరు సూచించగా.. రకుల్ వద్దని మహేష్ నిర్మొహమాటంగా చెప్పేసినట్టుగా టాక్.

రష్మిక నటిస్తుందా..?

స్పైడర్ సినిమా ఫ్లాప్ వలన మళ్లీ ఆ జంట కలిసి నటిస్తే అస్సలు క్రేజే ఉండదని, అలాగే ప్రస్తుతం క్రేజ్ లేని హీరోయిన్ మనకు అవసరం లేదని మహేష్ డైరెక్టర్, నిర్మాతలకు సూచించాడట. అలా రకుల్ కి మహేష్ గట్టి షాకిచ్చాడు. ఇక మహేష్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇప్పటికే రష్మిక మందన్న పేరు గట్టిగా వినబడుతుంది.

Tags:    

Similar News