ప్రభాస్ – సుజిత్ అంచనాలు టచ్ చేసినట్లే!!
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్.. బాహుబలి తో పిచ్చ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ తో ఇండియా వైడ్ గా సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని [more]
;
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్.. బాహుబలి తో పిచ్చ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ తో ఇండియా వైడ్ గా సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని [more]
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్.. బాహుబలి తో పిచ్చ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ తో ఇండియా వైడ్ గా సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడం అంటే.. ఆటలు అనుకున్నారు. సుజిత్ ఏంటి ఇంటర్నేషనల్ స్టాండడ్స్ లో సినిమా తియ్యడమేమిటి.. సుజిత్ కి అంత సీన్ లేదు. ఇక ప్రభాస్ బాహుబలి ని చూసి వాతలు పెట్టుకుంటున్నాడు. చిన్న డైరెక్టర్ తో ఇండియా వైడ్ గా సినిమా తీసి ఏం చేద్దామనుకుంటున్నాడో అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ పడ్డాయి. కానీ సాహో పోస్టర్స్ తో కాస్త సమాధానం చెప్పినా.. ఇంకా ఎక్కడో అనుమానం. సుజిత్ – ప్రభాస్ అనుకున్నది సాధించగలరా? లేదంటే మిడిసిపాటు… అనుకుంటున్నా టైం లోనే సాహో టీజర్ తో అండైర్ అనుమలను తుడిచేసారు.
సాహో టీజర్ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగు ప్రేక్షకుల కంటే ప్రభాస్ సాహో మీద బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారు
ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ లో సాహో సినిమా యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. బాహబలితో బాలీవుడ్ ని దున్నేసిన ప్రభాస్ సాహో తోనూ అక్కడి ప్రేక్షకులను పడెయ్యడం ఖాయంగా చెబుతున్నారు. సాహో టీజర్ చూసిన వారు బాహుబలికి మించి సాహో వర్కౌట్ అవుతుందని అంటున్నారు అంటే. సాహో క్రేజ్ ఏ రేంజ్ కి పెరిగిందో చెప్పొచ్చు. నిన్నమొన్నటివరకు స్తబ్దుగా ఉన్న బాలీవడ్ ట్రేడ్ వర్గాలు.. సాహో టీజర్ చూసాక వారు కూడా ప్రభాస్ ఇంటెర్నేషన్ స్టార్ అని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ బాహుబలితో ఎంతగా హిందీ ప్రేక్షకులకు దగ్గరయినా.. సాహో తో ఎలా మేనేజ్ చేస్తాడో అని భయపడిన వారికీ సాహో టీజర్ సమాధానం చెప్పింది. ప్రభాస్ లుక్స్, డ్రెస్సింగ్ స్టయిల్, యాక్షన్ సీన్స్ అన్ని సాహో ని ఓ రేంజ్ లో నిలబెట్టాయి. కేవలం టీజర్ కే ఇలా ఉంటె.. ట్రైలర్ విడుదలయ్యాక సాహో క్రేజ్ ఆకాశాన్ని తాకడం ఖాయం.