అనుకున్నదే అయ్యింది.. ఆమె అవుట్.. ఈమె రీ ఎంట్రీ..
ఈ వారం ఆడియన్స్ అనుకున్నట్లే జరిగింది. మరోసారి హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్, అనుకున్న అమ్మాయే రీ ఎంట్రీ..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7.. ఏడో వారం కూడా పూర్తి చేసేసుకుంది. ఇక ఈ వారం ఆడియన్స్ అనుకున్నట్లే జరిగింది. మరోసారి హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్, అనుకున్న అమ్మాయే రీ ఎంట్రీ ఇవ్వడం.. ఇలా ప్రేక్షకులు ఊహించినట్లే జరిగిపోయింది. ఈ వీకెండ్ దసరా పండుగా కూడా ఉండడంతో.. ఆదివారం ఎపిసోడ్ ని కొంచెం ఎక్కువ టైంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు. హీరోయిన్స్ డాన్స్‌లు, సింగర్స్ తో సాంగ్స్, సరదా గేమ్స్, కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం.. అంతా సందడిగా సాగింది.
కాగా ఏడో వారం ఎలిమినేషన్ లో అమరదీప్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, పూజామూర్తి, గౌతమ్ కృష్ణ, భోలె షావళి, అశ్విని ఉన్నారు. వీరిలో సేవ్ అయిన వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే అనౌన్స్ చేయించి కంటెస్టెంట్స్ ని హ్యాపీ చేశాడు నాగార్జున. ఇక చివరిలో పూజా, భోలె మిగలగా.. వీరిలో పూజామూర్తి ఎలిమినేట్ అయ్యినట్లు ప్రకటించారు. ఈమె ఐదో వారంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రెండు వీక్స్ లోనే ఎలిమినేషన్ తో బయటకి వచ్చేసింది.
ఇది ఇలా ఉంటే, గత వారం బిగ్‌బాస్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయిన రతిక, శుభశ్రీ, దామినిలో ఒకరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని, ఇందుకోసం హౌస్ లోని కంటెస్టెంట్స్ ఓటింగ్ చేయాలని కోరాడు. అయితే ఓట్లు వేశాక.. ఎక్కువ ఓట్లు వచ్చిన వారు కాకుండా, తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ షాక్ ఇచ్చాడు. ఇక ఈ ఓటింగ్ రిజల్ట్ ని ఈ వీక్ తెలియజేస్తాను అంటూ వెల్లడించాడు.
ఇక తక్కువ ఓట్లు అంటే.. రతికాకే వచ్చి ఉంటాయని అందరూ భావించారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కన్ఫార్మ్ అని లాస్ట్ వీకే అర్థమైపోయింది. రతిక ఎలిమినేషన్ తరువాత హౌస్ లో జోరు తగ్గింది. దీంతో ఆమెను మళ్ళీ తీసుకు వచ్చేందుకే.. బిగ్‌బాస్ ఓటింగ్ అనే గేమ్ ప్లే చేశాడని, డైరెక్ట్ గా తీసుకు వస్తే షో క్రెడిబిలిటీ దెబ్బతింటుందని భావించి.. ఓటింగ్ అనే డ్రామా ప్లే చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.