Unstoppable 2 : వైఎస్సార్ తో స్నేహం, హెల్త్ యూనివర్సిటీ పేరుమార్పు, మరెన్నో విషయాలు చెప్పిన చంద్రబాబు

రాళ్లు రప్పలుగా ఉన్న హైదరాబాద్ ని ముందుచూపుతో అభివృద్ధి చేశారు. అసలు హైదరాబాద్ ని ఇంతలా అభివృద్ధి చేయాలని ఎలా..

Update: 2022-10-14 12:56 GMT

unstoppable 2

నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన Unstoppable 2 ఫస్ట్ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్ లు గెస్ట్ లుగా వచ్చి.. ప్రజలకు తెలియని ఎన్నో ఫ్యామిలీ, రాజకీయ విషయాలను షేర్ చేసుకున్నారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. ముందుగా మీరు చేసిన రొమాంటిక్ పనులేంటి ? అని బాలకృష్ణ ప్రశ్నించగా.. చంద్రబాబు నవ్వుతూ.. మీకంటే ఎక్కువే రొమాంటిక్ పనులు చేశాము. మీరు సినిమాల్లో చేస్తే, మేము రియల్ లైఫ్ లో చేశాము. కాలేజీ రోజుల్లో మోటార్ బైక్ వేసుకొని అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి సౌండ్ పెంచేసి అల్లరి చేసేవాళ్ళమని చెప్పారు.

రాళ్లు రప్పలుగా ఉన్న హైదరాబాద్ ని ముందుచూపుతో అభివృద్ధి చేశారు. అసలు హైదరాబాద్ ని ఇంతలా అభివృద్ధి చేయాలని ఎలా అనుకున్నారు అని ప్రశ్నించారు బాలయ్య. అందుకు సమాధానమిస్తూ.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకంటే ముందు ఎన్టీఆర్ కు వచ్చిందన్నారు. అప్పట్లో జూబ్లిహిల్స్ డెడ్ ఎండ్. ప్రస్తుతం బాలకృష్ణ ఉంటున్న స్థలాన్ని చూపించి ఇక్కడ ఇల్లుకట్టాలంటే.. ఇక్కడెవరుంటారు అన్నాను. ఆ తర్వాత మీకోసమే ఆ ఇంటిని కట్టారు.
ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఉండటానికి ఇల్లులేక మెహదీపట్నంలో డబుల్ బెడ్రూమ్ రెంట్ కి తీసుకున్నాం. అప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచి బాలకృష్ణ చెన్నైలో సినిమాలతో ఉన్నాడు. 3,4 ఏళ్ళు మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు అని ఇప్పుడు మీరుండే ఇంటిని మాకిచ్చారు. అప్పుడికే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చాయి. అది నేను గమనించాను. ఎన్టీఆర్ గారు అది ముందే గమనించి ఇక్కడ ఇల్లు కట్టారు. దాంతో నాకు అర్థమైంది హైదరాబాద్ డెవలప్ అవుతుందని, నా కంటే ముందే ఎన్టీఆర్ గారు ఆలోచించి ఇలా కట్టారు." అని చెప్పారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై బాలయ్య అడగ్గా.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇదే జరిగిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి రాజీవ్ గాంధీ పేరు పెట్టి.. డొమెస్టిక్ ఎయిర్ పోర్టుకి ఎన్టీఆర్ పేరు పెడితే ఆయన మొత్తం కలిపి రాజీవ్ గాంధీ పేరు పెట్టారన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ఒక దానికి ఒక వ్యక్తి పేరు పెట్టామంటే అది ఒక చరిత్రగా, వారికి గుర్తుగా ఉండాలని పెడతామన్నారు. హెల్త్ యూనివర్సిటీ కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు తెచ్చుకున్నారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతామని చంద్రబాబు తెలిపారు.
ఇక బెస్ట్ ఫ్రెండ్ గురించి అడగ్గా.. "ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫ్రెండ్స్ మారుతూ ఉన్నారు. స్కూల్ సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూనివర్సిటీల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్నేహితులు అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి, నేను బాగా కలిసి తిరిగేవాళ్ళం. ఎమ్మెల్యేలు, మంత్రులుగా కలిసి ఎన్నో పోరాటాలు చేశాం. మా ఇద్దరిరి స్నేహం రాజకీయాల్లోనే మొదలైంది. బాగా క్లోజ్ అయ్యాము. కానీ ఆ తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చాక రాజకీయంగా ఫైట్ చేసుకున్నాం. నాకు, ఆయనకి రాజకీయంగా విభేదం ఉంది తప్ప పర్సనల్ గా మేమిద్దరం మంచి స్నేహితులం. అని చెప్పారు చంద్రబాబు"





Tags:    

Similar News