వైష్ణవ్ ఫిల్మ్ విషయంలో షాకిచ్చిన క్రిష్

దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ కి పవన్ కి కరోనా రావడం, సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడడంతో.. ఆ [more]

Update: 2021-05-11 17:18 GMT

దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ కి పవన్ కి కరోనా రావడం, సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడడంతో.. ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పడు క్రిష్ ఆల్రెడీ పూర్తి చేసేసి విడుదలకు సిద్దమైంది అంటున్న వైష్ణవ్ తేజ్ – రకుల్ కాంబోలో తెరకెక్కిన మూవీ కి ఇప్పుడు సీజీ వర్క్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీ కి ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయని, క్రిష్ ఎప్పుడో ఓటిటీలతో బేరానికి దిగాడని, త్వరలోనే వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఓటిటిలో రిలీజ్ అంటూ ఏవేవో వార్తలొస్తున్నా.. అసలు క్రిష్ – వైష్ణవ తేజ్ మూవీ షూటింగ్ పూర్తయి ఆ సినిమాకి సంబందించిన  వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాలేదట.  
వైష్ణవ తేజ్ – రకుల్ ప్రీత్ కాంబోలో కొండపల్లి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా  ఫారెస్ట్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ లో జంతువుల్నీ, ఆ వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డానికి వీఎఫ్ఎక్స్ చాలా కీల‌కం. దానికి సంబందించిన 80 శాతం ప‌ని వీఎఫ్ఎక్స్ కంపెనీల‌దే. అయితే క్రిష్ ఎప్పుడో వీఎఫ్ఎక్స్ కంపెనీ లకి పని అప్పజెప్పినా ఈ డిసెంబర్ వరకు వర్క్ పూర్తి చేసి ఇవ్వలేమని సదరు వీఎఫ్ఎక్స్ కంపెనీలు చేతులెత్తేశాయట. థియేటర్స్ మూతబడ్డాయి కాబట్టి వీఎఫ్ఎక్స్ వాళ్ళు లేట్ అవుతున్నా క్రిష్ టెంక్షన్ పడడం లేదట. 

Tags:    

Similar News