నారప్ప కోసం ఇద్దరు దర్శకులు?

వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ నారప్ప ని అధికారికంగా పట్టాలెక్కించేసాడు. తమిళంలో సూపర్ హిట్ హిట్ అయిన ధనుష్ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నాడు వెంకటేష్. [more]

Update: 2020-01-26 12:56 GMT

వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ నారప్ప ని అధికారికంగా పట్టాలెక్కించేసాడు. తమిళంలో సూపర్ హిట్ హిట్ అయిన ధనుష్ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నాడు వెంకటేష్. అసురన్ ని యాజిటీజ్ గా దింపేస్తున్నారని వెంకటేష్ నారప్ప లుక్ చూస్తే అర్ధమవుతుంది. ధనుష్ అసురన్ లుక్ కి నారప్ప లుక్ కి పెద్దగా తేడా లేదు. సేమ్ టు సేమ్ ఉంది. దాన్నిబట్టి అసురన్ నేటివిటీ చెడగొట్టే ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అసలే డిజాస్టర్ డైరెక్టర్ అని. కానీ వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ అడ్డలకే కనెక్ట్ అయ్యాడు.

అయితే అసురన్ సినిమా మొత్తం దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు నారప్ప సినిమా కూడా అదే కథ తో తెరకెక్కుతుంది. కాకపోతే కొంతమేర అనంతపురం కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దళితులకు, అగ్రవర్ణాలకు మధ్యన దళితులూ ఏ విధంగా అన్యాయం అయ్యారో.. అగ్రవర్ణాల చేతిలో దళితుల మరణాలు ఎలా సంభవించాయి అనేది నారప్పలొ చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మరో దర్శకుడు దిగుతున్నట్టుగ చెబుతున్నారు వెంకిమామ సినిమాని వెంకటేష్ తో చేసిన దర్శకుడు బాబీ నారప్ప సినిమా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నాడట. సినిమా మొత్తం శ్రీకాంత్ అడ్డాలా, కేవలం ఫైటింగ్ సీన్స్ బాబీ డైరెక్ట్ చేస్తారన్నమాట. అందుకే నారప్ప కోసం ఇద్దరు దిగుతున్నారు అని అన్నది.

Tags:    

Similar News