విజయ్ కామ్రేడ్ టెన్షన్ లో పడి ఓకే చేశాడా?

హిట్స్ ఉన్నప్పుడు పూరి తో విజయ్ దేవరకొండ సినిమా అనగానే విజయ్ లైన్ లోకొచ్చి ఖండించేశాడు. కానీ స్మార్ట్ హిట్ తర్వాత పూరి తో సినిమాకి విజయ్ [more]

Update: 2019-09-07 07:24 GMT

హిట్స్ ఉన్నప్పుడు పూరి తో విజయ్ దేవరకొండ సినిమా అనగానే విజయ్ లైన్ లోకొచ్చి ఖండించేశాడు. కానీ స్మార్ట్ హిట్ తర్వాత పూరి తో సినిమాకి విజయ్ సై అన్నాడు. కారణం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్లాప్ అవడమే. డియర్ కామ్రేడ్ ప్లాప్ తర్వాత పూరి తో సినిమాకి కమిట్ అయిన విజయ్ దేవరకొండ మాస్ ప్రేక్షకులను పడేసి.. క్రేజ్ కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే పూరి తో సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా ఓకే చేసాడు. అయితే పూరి జగన్నాధ్ ఎలాంటి స్టోరీ లైన్ వినిపించి విజయ్ దేవరకొండ ని సినిమాకి కమిట్ చేయించాడో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్.

ఆ కథ ఎలా నచ్చింది?

పూరి జగన్నాధ్ ఎలాంటి కొత్త స్టోరీ లైన్ తోనూ విజయ్ ని కలవలేదట. తన దగ్గరున్న పాత కథనే విజయ్ కి చెప్పినట్లుగా.. అది కూడా పూరి చాలామంది స్టార్ హీరోలకు చెప్పి రిజెక్ట్ చేయించుకున్న కథే అంటూ ప్రచారం జరుగుతుంది. హీరోలకే కాదు నిర్మాతలకు నచ్చని కథని విజయ్ ఓకే చేసాడంటున్నారు. అది కూడా కేవలం 15 నిమిషాల నేరేషన్ లో విజయ్ టెంప్ట్ అయ్యాడట. మరి పూర్తి కథ కూడా లేకుండా పూరి, విజయ్ ని బాగానే మ్యానేజ్ చేసాడంటున్నారు. అయితే పూరి కథ ఎలా ఉన్నా.. ఆయన టేకింగ్ నచ్చే విజయ్, పూరికి కనెక్ట్ అయ్యాడంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం డియర్ కామ్రేడ్ దెబ్బకి విజయ్ షేక్ అయ్యి.. ఇలా పూరి తో సినిమా ఓకే చేసాడంటున్నారు.

Tags:    

Similar News