VishwakSen : విశ్వక్‌సేన్ మూవీలో నటిస్తారా.. అయితే ఈ మెయిల్ ఐడికి..

కొత్త హీరోహీరోయిన్లు కావాలంటూ విశ్వక్ సేన్ ప్రకటన. మీకు నటించాలని ఉందా అయితే ఈ మెయిల్ ఐడికి..;

Update: 2023-12-30 15:11 GMT
Vishwak Sen, Cult, gangs of godavari, Vishwak Sen casting call for his new production movie Cult, movie news,  movie Cult,  Vishwak Sen

Vishwak Sen 

  • whatsapp icon
VishwakSen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. నటుడిగా మాత్రమే కాదు, రైటర్‌గా డైరెక్టర్‌గా ప్రొడ్యూసర్‌గా కూడా ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు. ఇప్పటికి దర్శకుడిగా రెండుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్స్ అందుకున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ మూవీలో విశ్వక్ హీరో కాదు. ఆ అవకాశాన్ని కొత్త వారికీ కల్పిస్తున్నారు.
కల్ట్ (#CULT) అనే టైటిల్ తో ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి తాను కథని అందిస్తూ.. దర్శకుడిగా కొత్త వాడైనా 'తాజుద్దీన్'కి అవకాశం ఇస్తున్నారు. దర్శకుడు మాత్రమే కాదు నటీనటులుగా కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న విశ్వక్ సేన్.. ఒక ప్రకటన ఇచ్చారు. బాగా నవ్వించే ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయిలు కావాలని పేర్కొన్నారు. వయసు 20 ఏళ్ళ పైబడి ఉండాలని పేర్కొన్నారు.
ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు.. cultthefilmofficial@gmail.com మెయిల్ ఐడికి వన్ మినిట్ యాక్టింగ్ వీడియో పంపాలని కోరారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పంపకూడదని పేర్కొన్నారు. మరి మీకు యాక్టింగ్ పై ఇంటరెస్ట్ ఉంటే.. ఇప్పుడు ఆ మెయిల్ ఐడికి మీ వీడియో పంపేయండి. మీరే హీరోహీరోయిన్స్ గా నటించే అవకాశం అందుకోగలరు. కాగా ఈ చిత్రాన్ని విశ్వక్ తన సొంత నిర్మాణ సంస్థలు అయిన VS సినిమాస్, వన్మయి క్రియేషన్స్ లో నిర్మించబోతున్నారు.
ఇక ఈ కాస్టింగ్ కాల్ తో పాటు సినిమా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో టైటిల్ కింద 'Like A Leap Year 2024' అని క్యాప్షన్ ఉంది. అలాగే Say No To Drugs అని కూడా పోస్టర్ మీద వేశారు. దీనిబట్టి చూస్తే ఈ చిత్రం.. న్యూ ఏజ్ యూత్ స్టోరీతో డ్రగ్స్ చుట్టూ తిరిగే స్టోరీ అని అర్ధమవుతుంది.
Tags:    

Similar News