తాప్సీ మల్లి నోరు జారింది

Update: 2018-03-04 09:44 GMT

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఈమధ్య తెగ నోరు పారేసుకుంటుంది. బాలీవుడ్ లో రెండు మూడు హిట్స్ రాగానే టాలీవుడ్ పై సందర్భం దొరికినప్పుడల్లా డైలాగులు పేలుస్తుంది. ఆన్ స్క్రీన్ ఏ కాదు..ఆఫ్ స్క్రీన్ లో కూడా డైలాగ్స్ చూపించడానికి మహా ట్రై చేసేస్తోంది.

బాలీవుడ్ లో ఇష్టమొచ్చినట్లు తిట్టిపారేసి.. టాలీవుడ్ కి వచ్చి ఆబ్బె ఆలా అనలేదు అనడం ఈమెకు కామన్ అయిపోయింది. ఇక లేటెస్ట్ గా ఆమెపై ఓ రూమర్ వచ్చింది. తాప్సీ పెళ్లికి రెడీ అయిపోయిందంటూ తాజాగా వార్తలు వచ్చాయి. అది కూడా ఓ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో అని. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారు..ఈ ఫారిన్ బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై తాప్సీ స్పందిస్తూ.. సినిమా స్టార్స్ పై ఇలాంటి రూమర్స్ కాకుండా.. ఏది నిజమో ఏది అబద్ధమో తెల్సుకుని రాస్తే బాగుంటుందని తిట్టిపోసింది. అడ్డమైన గాసిప్ లను టెలికాస్ట్ చేయద్దంటూ గట్టి మాటలనే పేల్చింది తాప్సీ. కొంత మంది స్టార్స్ కావాలనే ఇలా రూమర్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. కొన్నాళ్ల క్రితం వరకూ తాప్సీ కూడా ఇదే స్థాయిలో ఉండేది. కానీ రెండు హిట్స్ వచ్చేసరికి ఇమేజ్ పెరిగేసరికి తిట్టిపోయడాలు మొదలుపెట్టింది.

Similar News