Jailer Vinayakan: హైదరాబాద్ లో రచ్చ చేసిన వినాయకన్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ లో రచ్చ చేసిన వినాయకన్‌

Update: 2024-09-08 01:59 GMT

రజనీకాంత్ చిత్రం 'జైలర్'లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు టికె వినాయకన్‌ను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు ఇండిగో గేట్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు అదుపులోకి తీసుకున్నారు. నటుడు మద్యం మత్తులో ఉన్నాడని, బహిరంగ ప్రదేశంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని నివేదించారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు వచ్చి గోవాకు వెళ్తున్న వినాయకన్‌ ఎయిర్‌పోర్టు ఫ్లోర్‌లో షర్ట్‌ లేకుండా కూర్చుని సిబ్బందిపై కేకలు వేశాడు.

విమానాశ్రయంలో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా బృందం వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ బాల్‌రాజ్ తెలిపారు. వినాయకన్‌ వివాదాల్లో భాగమవ్వడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2023లో, కేరళలోని ఎర్నాకులంలో కూడా ఒక పోలీస్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించినందుకు అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. సినిమా ఇండస్ట్రీలో వినాయకన్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. కానీ వినాయకన్ కు ఇటీవల జైలర్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. అయితే అతడి ప్రవర్తన కారణంగా చిక్కుల్లో పడుతున్నాడు. మద్యం మత్తులో ఎప్పుడూ ఉంటాడనే ఆరోపణలు కూడా ఉండడంతో అతడికి అవకాశాలు ఇవ్వడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు.


Tags:    

Similar News