రైతులకు మేలు చేసే రామదాసు పక్షి- ప్రత్యేకతలు తెలుసా?

ఎలుకలు, మిడుతలు తిని రైతులకు మేలు చేసే రామదాసు పక్షి. శాస్త్రీయ నామం ఎలనస్ ఆక్సిల్లరీస్, గుణాలు వివరాలు ఇక్కడ.;

Update: 2025-02-01 12:02 GMT
రైతులకు మేలు చేసే రామదాసు పక్షి- ప్రత్యేకతలు తెలుసా?
  • whatsapp icon

ఎదురుగా చెట్టు మీద కూర్చుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న ఈ పక్షిని బ్లాక్ వింజ్ డ్ కైట్ , బ్లాక్ షోల్డర్ కైట్ (నల్ల రెక్కల తెల్ల డేగ )అని పిలుస్తారు.

గిరిజన ప్రాంతాల్లో దీనిని అడవి రామదాసు అంటారు.ఆక్సిపిట్రుడే కుటుంబానికి చెందిన ఈ పక్షి శాస్త్రీయ నామం ఎలనస్ ఆక్సిల్లరీస్.

గాలిలో ఎగురుతూ ఒకే చోట నిశ్చలంగా ఉండగలుగుతుంది.రైతులకు ఎంతో మేలు చేస్తుంది.పంట పొలాల్లో ఎలుకలు,మిడుతలు, గొంగళి పురుగులు, పాములను గురించి వేగంగా వాటిపైకి దూకి భుజిస్తుందని మహబూబ్నగర్ లోని ఎంవీఎస్ ప్రభుత్వ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్ బక్షి రవీందర్ తెలిపారు.చూడగానే గుడ్లగూబ మాదిరిగా కనిపించే ఈ పక్షి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలతో పాటు మనదేశంలో సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలలో అధికంగా కనిపిస్తుంది అని అన్నారు.

Tags:    

Similar News