Sri RamaNavami 2023 : శ్రీరామనవమి రోజున రాములవారిని ఇలా పూజించండి..ఈ పనులు చేయకండి
ఈ సమయంలో కొన్ని పూజా నియమాలను పాటించాలి. రామువారికి పూజ చేసేందుకు ఐదు ఒత్తుల దీపారాధనకు ..
శ్రీరామనవమి అంటే రాములవారి పుట్టినరోజు. అలాగే సీతారాముల కల్యాణం జరిగిన రోజు. అందుకే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరాముడు ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు కాబట్టి.. అదే సమయంలో సీతారాముల కల్యాణం, శ్రీరాముడికి పూజ చేస్తారు. ఈ ఏడాది మార్చి 30న శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. ఈ సమయంలో కొన్ని పూజా నియమాలను పాటించాలి. రామువారికి పూజ చేసేందుకు ఐదు ఒత్తుల దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. దీపారాధన అనంతరం.. స్వామివారిని తులసిమాలతో అలంకరించాలి. పూజ పూర్తైన అనంతరం శక్తిమేరకు పేదలకు అన్నదానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని హిందువుల నమ్మిక. అలాగే ముత్తైదువులకు కూడా తాంబూలం ఇవ్వడం అనాదిగా వస్తోన్న ఆచారం.
నవమిరోజున ఈ పనులు చేయకండి
శ్రీరామనవమి రోజు మాంసం, మందు తీసుకోవచం మంచిది కాదు.
అలాగే జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం మానుకోవాలి
మనకు చెడు చేసిన వాళ్లైనా సరే.. వాళ్లని అసభ్యపదజాలంతో దూషించడం, చెడుగా మాట్లాడటం వంటివి చేయరాదు.
మీ జీవిత భాగస్వామితో అబద్ధాలు చెప్పరాదు. వారిని మోసం చేసేలా ఏ పనీ చేయకూడదు.
వీలైనంతవరకూ ప్రతి ఒక్కరితోనూ మంచిగా సంభాషించేందుకు ప్రయత్నించండి.
శ్రీరామనవమి రోజున వీలైతే రామచరిత మానస, రామ చాలీసా, శ్రీరామ రక్షాస్తోత్రాలను పఠించడం. రామ కీల్తనలు, భజనలు, స్తోత్రాలను పఠించడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయవచ్చు.