Sri RamaNavami 2023 : సీతారాముల కల్యాణం జరిగింది శ్రీరామనవమి రోజు కాదా ?
కానీ.. వాటిని విడివిడిగా జరపకుండా.. పండితులంతా కలిసి శ్రీరామనవమి రోజునే రాములోరి కల్యాణం, పట్టాభిషేకం, నవమి..
మనుషులను, దేవతలను పట్టిపీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తే 10 అవతారాలు ఎత్తాడు. వాటిలో శ్రీరామ అవతారం ఒకటి. దేవతల మొర ఆలకించి దశరథుడు - కౌసల్య దేవిలకు చైత్రశుద్ధ నవమి, గురువారం మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో పునర్వసు లగ్నంలో 12 గంటలకు జన్మించాడు. ఈ సారి శ్రీరామనవమికి ఉన్న విశేషం ఇదే. సరిగ్గా రాముడు పుట్టిన గురువారం రోజునే శ్రీరామనవమి పండుగ వచ్చింది.
రామనవమి అంటే.. రాముడి పుట్టినరోజుతో పాటు సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజున జరిగిందని భక్తుల విశ్వాసం. కానీ నిజానికి సీతారాముల కల్యాణం జరిగింది మార్గశిర మాసం శుద్ధ పంచమి రోజున జరిగిందని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే పట్టాభిషేకం జరిగింది కూడా మరోరోజునే. కానీ.. వాటిని విడివిడిగా జరపకుండా.. పండితులంతా కలిసి శ్రీరామనవమి రోజునే రాములోరి కల్యాణం, పట్టాభిషేకం, నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడి వారు అక్కడ ఆ ప్రాంతానికి తగిన ఆచారం ప్రకారం నవమి వేడుకలను జరుపుకుంటారు. అందుకే మన దేశమంతా ఆ రోజునే సీతారాముల కల్యాణాన్ని జరుపుకుంటుంది. పక్క దేశాలైనా నేపాల్, భూటాన్ లలో మాత్రం మార్గశిర శుద్ధ పంచమి రోజునే రాములవారి కల్యాణాన్ని నిర్వహిస్తారట. ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పూర్ణిమ నాడు రాత్రివేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.