ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఇక పరుగులేనా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవాలని అనుకుంటూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లా పైనా ఫోకస్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవాలని అనుకుంటూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లా పైనా ఫోకస్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయము కుదురుతూ ఉండడంపై పార్టీ హై కమాండ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్‌లోని కాంగ్రెస్‌లోని వివిధ వర్గాలు ఏకమయ్యాయి. వయోభారం కారణంగా దశాబ్ద కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవలి కర్ణాటక ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని, పార్టీ హైకమాండ్ సూచన మేరకు అందరూ కలిసిపోయి ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలని రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపుకు అందరూ కలిసిపోయి పని చేయాలని సూచించారు. ఆయన చెప్పినట్లుగా పలువురు నేతల్లో మార్పు కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జి. సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏ సంజీవ్‌రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రాతినిథ్యం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో అభ్యర్థి.. ప్రత్యేకంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అందరినీ కలిసి ప్రచారం చేసేలా రాంచంద్రారెడ్డి పావులు కలిపారు.