వరంగల్ వాసులకు సూపర్ గుడ్ న్యూస్

వరంగల్ జిల్లా వాసులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది

Update: 2024-11-18 01:50 GMT

వరంగల్ జిల్లా వాసులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ అండ్ బి శాఖ లేఖ రాసింది. మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది.

త్వరలోనే...
ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశేష కృషి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. దీంతో త్వరలోనే ఎయిర్ పోర్టు కల సాకారం కానుంది. వరంగల్ వాసులు ఇక హైదరాబాద్ కు రాకుండా నేరుగా వరంగల్ నుంచి ఆకాశ మార్గాన ప్రయాణించే వీలు కలుగుతుంది.


Tags:    

Similar News