కన్నా.. నీకు నేనున్నా..!!

భార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ ఎదుట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త..!!

Update: 2024-11-17 10:41 GMT

భార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ ఎదుట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త..!!

కరీంనగర్ లో జరిగిన ఈ ఘటన...చూపరుల హృదయాలని హత్తుకుంది..!!

ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి పేరు శంకర్..తను ఒక కంపెనీలో అకౌంటెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు...!!

స్వప్న,తన భార్య.....తనకి ఇవాళ గ్రూప్ -3 పరీక్ష రాయాల్సి ఉంది.దానికి సంభందించిన పరీక్ష కేంద్రం.... కరీంనగర్ లోని స్థానిక సిద్దార్థ పాఠశాల లో ఉంది...!!

వారిరువురికి ఒక బిడ్డ ఉంది.. పరీక్ష రాయడానికి తన భార్య స్వప్న కేంద్రంలోకి వెళ్ళగానే..

దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని... తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి.. నిద్ర పుచ్చుతూ కనిపించాడు... శంకర్!

దీంతో మహిళల కెరీర్ ఎదుగుదలలో భర్త పాత్ర ఎంతో ముఖ్యంగా మారింది అనడానికి నిదర్శనమే ఇది అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు...!!!

కాగా తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా...ఈ రోజు గ్రూప్ -3 అభ్యర్థులందరూ తమ తమ పరీక్షా కేంద్రాలకు హాజరవటం మనం చూసాం...!!

Tags:    

Similar News