ఖమ్మం సభ ఖర్చంతా ఆయనదే.. కారణమిదే
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం సభ ఖర్చు మొత్తాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పెట్టుకుంటున్నారని ఆయన తెలిపారు. రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ తోట చంద్రశేఖర్ రావుకు హఫీజ్‌ఫేటలో ఉన్న 40 ఎకరాల విలువైన భూమిని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని రఘునందన్ రావు ఆరోపించారు. అందువల్ల ఖమ్మం సభ ఖర్చును తోట చంద్రశేఖర్ రావు భరిస్తున్నారని అన్నారు.
ఎనిమిది ఎకరాలకు మాత్రం...
హఫీజ్ పేట్ లోసర్వే నెంబరు 78లో ఉన్న 400 కోట్ల విలువైన భూమిని తోట చంద్రశేఖర్ అమ్ముకునేందుకు అనుమతివ్వడం వల్లనే ఆయన ఖమ్మం సభ ఖర్చుకు అంగీకరించారన్నారు. అదే సర్వే నెంబరు లో ఉన్న ఎంబీఎస్ జ్యుయలర్స్ సుఖేష్ కు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని అమ్ముకోవచ్చని హైకోర్టు తీర్పు ఇస్తే, దానిపై కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారని, కానీ తోట చంద్రశేఖర్ భూమి విషయంలో అమ్ముకునేందుకు ఎందుకు అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు.