రెండో విడత యాత్రకు సిద్ధం

బీజేపీ అధ్యక్షుడు రెండోదశ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రెండో విడత పాదయాత్ర వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది;

Update: 2022-03-26 01:13 GMT
bandi sanjay, bjp state president,  padayatra, ts politics
  • whatsapp icon

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రెండోదశ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రెండో విడత పాదయాత్ర వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రెండో దశ యాత్రను ఆలంపూర్ లోని జోగులాంబ ఆలయం నుంచి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. గత ఏడాది ఆగస్టులో తొలిదశ యాత్రను బండి సంజయ్ 36 రోజుల పాటు నిర్వహించారు. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది.

జోగులాంబ ఆలయం నుంచి....
ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. పార్లమెంటు సమావేశాలు పూర్తి కానుండటంతో బండి సంజయ్ ఈ యాత్రతో అన్ని నియోజకవర్గాలను తాకేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా ఈ యాత్ర ఉపయోగపడుతుందన్న అంచనాలో బీజేపీ నేతలున్నారు. ముగింపు సభకు కేంద్ర మంత్రులు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News