మధ్యాహ్నానికి బండి పాదయాత్రపై స్పష్టత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు భైంసా నుంచి ప్రారంభించాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు భైంసా నుంచి ప్రారంభించాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతల దృష్ట్యా తాము అనుమతి ఇవ్వలేమని, తమ వద్ద అంత మంది సిబ్బంది లేరని పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఆయన భైంసాకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ కూడా చేశారు. దీంతో బండి సంజయ్ తన పాదయాత్రపై ఈరోజు హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
పోలీసుల అనుమతి....
బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభానికి అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నానికి బండి పాదయాత్రపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ యాత్ర సందర్భంగా భైంసాలో భారీ బహిరంగ సభను కూడా బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో బండి పాదయాత్ర ప్రారంభం కానుందా? లేదా? అన్నది ఈరోజు మధ్యాహ్నానికి తేలనుంది.