BRS : గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాల చిట్టా

గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం కానీ పేలవంగా ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు

Update: 2024-02-08 11:12 GMT

గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం కానీ పేలవంగా ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చిందని తెలిపారు. మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు నిరాశ కల్గించిందన్నారు. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశ మిగిల్చిందని, ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని, మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదన్న హరీశ్ రావు నిరుద్యోగ భృతి గురించి కూడా చెప్పలేదన్నారు.

వినతులు స్వీకరించేందుకు...

ముఖ్యమంత్రి ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారు అన్నారని, తర్వాతు మంత్రులు, ఐఎఎస్ లు లేరని, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ గారి నోట చెప్పించారన్నారు. ఆరు గ్యారెంటీలో మొత్తం 13 ఉన్నాయని, రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. 500 రూపాయలకే గ్యాస్, కరెంట్ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారని మాత్రమే చెప్పారని ఎప్పటిలోగా అన్నది మాత్రంచెప్పలేదన్నారు. రైతుల రెండు లక్షల రుణమాఫీ అంశం కూడా గవర్నర్ ప్రసంగంలో చోటు లేకపోవడంతో ఆ హామీ అమలుకు నోచుకుంటుందా? లేదా? అన్న అనుమానం కలుగుతుందన్నారు.


Tags:    

Similar News