నేడు ఎస్.ఎల్.బి.సి వద్దకు బీఆర్ఎస్ నేతలు
నేడు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు.;

నేడు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ బృందం బయలుదేరి వెళ్లనుంది. ఉదయం 8 గంటలకు కోకాపేట లోని తన నివాసం నుండి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులతో కలిసి హరీష్ రావు బయలుదేరారు.
హరీశ్ రావు నేతృత్వంలో...
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో గత శనివారం ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడ లేదు. నాలుగు రోజుల నుంచి సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు బీఆర్ నేతలు నేడు అక్కడికి చేరుకోనున్నారు.