దళితుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు;

అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. దార్శనికతతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారని ముఖ్యమంత్రి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు.
అంబేద్కర్ కు ఘన నివాళులు...
అంబేద్కర్‌తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. దళితుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి నుంచి దళితుల పక్షాన నిలబడుతుందని ఆయన అన్నారు.