ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయ్

ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే జనగామకు వచ్చి చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Update: 2022-02-11 09:03 GMT

ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే జనగామకు వచ్చి చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జనగామలో ఆయన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఏడేళ్ల క్రితం జనగామను చూస్తూ కరువు ప్రాంతంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఇక్కడ రెండు పంటలు పండించుకునే పరిస్థితికి తెచ్చుకున్నామన్నారు. ఏడేళ్ల క్రితం ఇక్కడ ఎకరా రెండు లక్షలుండేది నేడు కోట్లకు చేరుకుందని తెలిపారు. ఇది అభివృద్ధి కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

అధికారుల సహకారంతోనే...
అధికారుల సహకారంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. జనగామలో ఇలాంటి భవనాన్ని చూడగలుతామని మనం భావించామా? అని ఆయన అన్నారు. జనగామలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే కోటీశ్వరుడని కేసీఆర్ అన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు చేసిన శ్రమ వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పానన్నారు.
సమిష్టి కృషి వల్లనే....
తెలంగాణ ఉద్యోగుల జీతాలు కూడా ఇంకా పెరుగుతాయని కేసీఆర్ చెప్పారు. వచ్చిన డబ్బు ఏం చేసుకుంటాం. పనిచేసిన వారికే పంచి పెడతామని ఆయన చెప్పారు. కరెంట్ కనురెప్పపాటు పోకుండా విద్యుత్తు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. విద్యుత్తు ఉద్యోగులు రేయింబవళ్లూ కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ కితాబిచ్చారు. అన్ని రంగాల్లో తెలంగాణలో అభివృద్ధి చెందిందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెరుగుతాయని చెప్పారు.


Tags:    

Similar News