Telangana : నేటి నుంచి పాలమూరులో రైతు సదస్సు
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు సదస్సులు జరగనున్నాయి.;
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు సదస్సులు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఈరోజు నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు రోజుల రైతు సదస్సులు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా మంత్రి జూపూడి కూడా హాజరు కానున్నారు.
మూడు రోజుల పాటు...
ఈ నెల 28వ తేదీ అంటే ఈరోజు రైతు సదస్సు కోసం జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. మహబూబ్ నగర్ లో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేశారు. రేపు కూడా రైతు సదస్సు జరగనుంది. ఎల్లుండి ఈ నెల 30వ తేదీన మాత్రం ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.