Telangana : పాలమూరులో అందరికీ గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు;

Update: 2024-11-28 04:48 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ లో రైతు సదస్సులు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన జరిగే రైతు సదస్సుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రెండో రోజైన 29వ తేదీన ఇతర జిల్లాాల నుంచి కూడా రైతులు హాజరవుతారు. 30వ తేదీన మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది రైతులు హాజరయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. 30వ తేదీన రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. 30వ తేదీన కీలక ప్రకటన చేయనున్నారని అధికారికవర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.

ఏడాది పూర్తి కావడంతో…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబరు 7వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్బంగా తొలుత వరంగల్ లో ఇటీవల ఇందిరా శక్తి మిషన్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రెండో సభను మహబూబ్ నగర్ లో రైతు సదస్సు పేరిట ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అక్కడి నుంచే.. అదే వేదికపై నుంచి కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.విమర్శించే వారి నోళ్లను మూయించడానికి కూడా పాలమూరు వేదికను రేవంత్ ఉపయోగించుకుంటారని తెలిసింది. అందుకోసం ఇప్పటికే అధికారులు కసరత్లులుచేస్తున్నారు.

రైతు భరోసా కూడా…

ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంచేసింది. సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రైతుల కోసం రైతు భరోసా నిధులను విడుదలచేయాల్సి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంకా రైతు భరోసానిధులను విడుదలచేయకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది పార్టీకి ప్రభుత్వానికి కొంతచెడ్డపేరు వస్తుండటంతో రైతు భరోసా నిధులను డిసెంబరు నెల నుంచి విడుదలచేయాలని నిర్ణయించింది.ఇప్పటికే రెండు లక్షల రుణ మాఫీ తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో పాలమూరులో ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారని తెలిసింది.

అర్హతలివే…

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఎకరాకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధివిధానాలను నిర్ణయించడంపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. మంత్రి వర్గ ఉప సంఘం వివిధ జిల్లాలను పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పించింది. సాగయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను ఇవ్వనున్నారు. అదే సమయంలో పది ఎకరాలున్న వారికి మాత్రమే ఈ సాయం అందుతుందని కూడా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పదికి మించి ఒక ఎకరం ఉన్నా వారికి రైతు భరోసా నిధులు అందవన్నది అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పాలమూరులో రైతు సదస్సులో ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీన దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.






Tags:    

Similar News