లైన్ దాటితే వేటు తప్పదు : వీహెచ్‌కు పరోక్ష హెచ్చరిక
పార్టీ నిర్ణయాలను ఎవరు వ్యతిరేకిస్తూ మాట్లాడినా వారిపై చర్యలు తప్పవని కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు
పార్టీ నిర్ణయాలను ఎవరు వ్యతిరేకిస్తూ మాట్లాడినా వారిపై చర్యలు తప్పవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎవరైనా మీడియా ఎదుట బహిరంగంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే పార్టీ నిర్ణయాలను ఆమోదించాల్సిందేనని అన్నారు.
అంతర్గత వేదికల్లో...
ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించవచ్చని, మీడియాకు ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతటి సీనియర్ అయినా ఉపేక్షించబోమని ఆయన తెలిపారు. సీనియర్ నేత వీహెచ్ ను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేశారంటున్నారు. ప్రజాస్వామ్యం ఉంది కదా? అని ఎవరు ఏది పడితే అది మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా అన్నారు.