నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ.. హాజరు కానున్న కవిత

నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు కల్వకుంట్ల కవిత వర్చువల్ గా హాజరు కానున్నారు.;

Update: 2024-09-25 02:44 GMT
kalvakuntla kavitha, brs mlc, delhi liquor scam,  . brs mlc kalvakuntla kavitha will attend the trial in rouse avenue court of delhi virtually, delhi liquor scam case in court today, kalvakuntla kavitha latest news todayt telugu

kalvakuntla kavitha

  • whatsapp icon

నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్ గా హాజరు కానున్నారు. నేడు కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై విచారణ జరుగుతుంది. ఈ విచారణకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా హాజరు కానున్నారు.

సీబీఐ ఛార్జిషీట్ పై...
కవితకు బెయిల్ ఇచ్చే సమయంలో ఈ కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వాదనలను న్యాయస్థానం విననుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అనేక మందికి బెయిల్ లభించిన నేపథ్యంలో నేడు సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ జరగనుంది.


Tags:    

Similar News